Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి: కలెక్టర్

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 10, 2026 4:07 PM జగిత్యాలGeneral
పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి: కలెక్టర్ - Udayam
మెట్‌పల్లి పట్టణంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాల పనులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం పరిశీలించారు. పనులను వేగవంతంగా, నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో రాజీపడవద్దని సూచించారు.

Comments

G
Loading comments...