Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంటల బీమా నమోదుకు ఆగస్టు 31 వరకు గడువు

Follow Udayam on Google
B RAJESH Aug 16, 2026 3:51 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
పంటల బీమా నమోదుకు ఆగస్టు 31 వరకు గడువు - Udayam
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రుణం పొందిన వరి, మొక్కజొన్న రైతులు పంటల బీమా నమోదును ఆగస్టు 31లోపు పూర్తి చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి రామారావు ఆదివారం తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 45,563 మంది రైతులు 26,854 హెక్టార్లకు బీమా నమోదు చేసుకున్నారని చెప్పారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా రైతుల సంబంధిత బ్యాంకులను సంప్రదించి వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...