వార్తలకు తిరిగి వెళ్లండి

సోమందేపల్లి మండలం పందిపర్తిలో మంత్రి సవిత శుక్రవారం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ ఛైర్మన్ వెంకటరమణ గురువారం ఏర్పాట్లను పరిశీలించారు. ఓవర్‌హెడ్ ట్యాంక్ ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొంటారని తెలిపారు.
అనంతరం మడకశిర ఉపకాలువ నీటి ప్రవాహ సామర్థ్యాన్ని 48 క్యూసెక్కుల నుంచి 64 క్యూసెక్కులకు పెంచే పనులకు మంత్రి శంకుస్థాపన చేస్తారని వెంకటరమణ చెప్పారు.
Comments
Loading comments...

