Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీ కార్యాలయాలను తనిఖీ చేసిన జిల్లా అధికారి

Follow Udayam on Google
K.Venkatesh Sep 08, 2026 2:57 PM ఖమ్మంGeneral
పంచాయతీ కార్యాలయాలను తనిఖీ చేసిన జిల్లా అధికారి - Udayam
ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం, సువర్ణాపురం గ్రామ పంచాయతీ కార్యాలయాలను మంగళవారం జిల్లా పంచాయతీ అధికారి (DPO) వినోద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ పరిధిలోని రికార్డులు, రిజిస్టర్లు, పన్ను వసూళ్ల వివరాలు, నగదు పుస్తకాలను ఆయన నిశితంగా పరిశీలించారు. గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా తీరుపై ఆయన ఆరా తీశారు.

Comments

G
Loading comments...