వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లా ఆట్యా-పాట్యా అసోసియేషన్ ఆధ్వర్యంలో నకరికల్లులోని వంగ వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సబ్ జూనియర్ జట్టు ఎంపికలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 90 మంది బాలురు, 75 మంది బాలికలు పాల్గొన్నట్లు జిల్లా సెక్రటరీ వి.రోహిత్ జోయల్ తెలిపారు.
ఎంపికైన జట్లు ఈ నెల 12, 13 తేదీల్లో కర్నూలులో జరిగే 12వ సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

