వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కుభీర్ మండలం డోడర్నా చెరువులో ఇద్దరు బాలురు నీట మునిగి మృతి చెందిన ఘటన తనను ఎంతో కలచివేసిందని కుభీర్ ఎస్సై కృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సెలవు దినాల్లో పిల్లలు ప్రమాదాల బారిన పడకుండా తల్లిదండ్రులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ముఖ్యంగా ఈత సరదాతో చెరువులు, వాగులు, కుంటల వైపు వెళ్లకుండా కట్టడి చేయాలన్నారు. వారి కదలికలను గమనిస్తూ కాపాడుకోవాలని కోరారు.
Comments
Loading comments...

