వార్తలకు తిరిగి వెళ్లండి

పిఠాపురం మండలం పి.దొంతమూరులో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమైంది. ఇంటిలో వంట చేస్తుండగా గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు.
ఈ ప్రమాదంలో గాలింకి వీరబాబు ఇల్లు, సామగ్రి పూర్తిగా కాలిపోయింది. దీంతో బాధిత దంపతులు కట్టుబట్టలతో మిగిలారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
Comments
Loading comments...

