వార్తలకు తిరిగి వెళ్లండి

లింగంపల్లి - విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు పిడుగురాళ్ల రైల్వే స్టేషన్‌లో హాల్ట్ మంజూరైంది. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర రైల్వే మంత్రితో మాట్లాడి ఈ స్టాప్‌ను కేటాయించేలా చొరవ తీసుకున్నారు. దీంతో రేపటి నుంచి ఈ రైలు పిడుగురాళ్లలో ఆగనుంది.
లింగంపల్లి తర్వాత కేవలం నల్గొండలోనే ఆగే ఈ రైలుకు ఇప్పుడు పిడుగురాళ్లలోనూ స్టాప్ కేటాయించడంపై స్థానిక ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

