వార్తలకు తిరిగి వెళ్లండి

పిచ్చాటూరు మండల పరిషత్ కార్యాలయంలో నేడు మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీటీసీ, జడ్పీటీసీ రెండో సాధారణ ఎన్నికల నిర్వహణపై అత్యవసర సమీక్ష సమావేశం జరగనుంది. ఎన్నికల ఏర్పాట్లపై అధికారులు చర్చించనున్నారు.
కోడ్ అమలు, సిబ్బంది కేటాయింపు, పోలీసు బందోబస్తుపై సమావేశంలో సమీక్షించనున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల అఖిలపక్ష నాయకులు సకాలంలో హాజరుకావాలని ఆర్వో ప్రకాశ్ రావు కోరారు.
Comments
Loading comments...

