వార్తలకు తిరిగి వెళ్లండి

నాగలిగిద్ద మండల పిఆర్టియు అధ్యక్షుడిగా శేరీకర్ రమేష్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా జీవన్‌రావు ఎన్నికయ్యారు. రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో జిల్లా నాయకుల ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి.
రమేష్ మాట్లాడుతూ తనను ఎన్నుకున్న ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం రమేష్, జీవన్‌రావులను ఉపాధ్యాయులు శాలువాలతో సన్మానించారు.
Comments
Loading comments...

