Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫొటోలో 12 మంది, కేసు 10 మందిపైనే

Follow Udayam on Google
Reporter.Bharath Sep 20, 2026 12:02 PM గుంటూరువాణిజ్యం
ఫొటోలో 12 మంది, కేసు 10 మందిపైనే - Udayam
ఫిరంగిపురం మండలం తక్కెళ్లపాడులో శనివారం జరిగిన పేకాట స్థావరం దాడి వ్యవహారంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడిలో 10 మందిని అరెస్ట్ చేసి రూ.6,600 స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, పోలీసులు విడుదల చేసిన ఫోటోలో 12 మంది ఉండగా, కేవలం 10 మందిపైనే కేసు నమోదు చేయడం గమనార్హం. ఫోటోలో ఉన్న ఆ మిగిలిన ఇద్దరు ఏమైనట్లు? వారిని ఎందుకు వదిలేశారు? అని స్థానికంగా చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...