Udayam Digital
Menu

ఫోన్ మందలింపుతో వివాహిత ఆత్మహత్య

Shruthi Nov 21, 2026 7:57 AM హైదరాబాద్General
ఫోన్ మందలింపుతో వివాహిత ఆత్మహత్య - Udayam Digital
సెల్‌ఫోన్ ఎక్కువగా చూడొద్దని కన్నతల్లి మందలించడంతో మనస్తాపం చెందిన లక్ష్మిదేవి(25) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఈమె కుటుంబంతో కలిసి హయత్‌నగర్‌లో నివసిస్తోంది. గురువారం తల్లి మందలించడంతో, శుక్రవారం ఉదయం భర్త పనికి వెళ్లిన తర్వాత పిల్లలను టీవీ చూడమని చెప్పి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...