Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై రోడ్డు అధ్వానం

Follow Udayam on Google
B Ganga Sep 12, 2026 12:09 PM పార్వతీపురం మన్యంGeneral
ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై రోడ్డు అధ్వానం - Udayam
సీతానగరం ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై రహదారిపై పెద్ద పెద్ద గోతులతో అధ్వానంగా ఉండటంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ బ్రిడ్జిపై నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. గతంలో గోతులలో పడి ప్రమాదాలు జరిగే సందర్భాలు అనేకం ఉన్నాయి. వర్షాలకు గోతులు నీరు చేరి వాహనదారులకు గోతులు కనబడని కారణంగా మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు వాపోతున్నారు.

Comments

G
Loading comments...