వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిరంగిపురం మండలం మేరికపూడి గ్రామ సమీపంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఢీకొనడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదాన్ని గమనించిన మేరికపూడి యువకులు వెంటనే స్పందించి క్షతగాత్రులను అంబులెన్స్‌లో నరసరావుపేటలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

