Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిరంగిపురంలో పేకాట స్థావరాలపై దాడులు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 16, 2026 6:30 PM గుంటూరుGeneral
ఫిరంగిపురంలో పేకాట స్థావరాలపై దాడులు - Udayam
ఫిరంగిపురం మండలం 113 తాళ్లూరులోని పాత రైస్ మిల్లు, వైఎస్సార్ విగ్రహం సమీపంలో చెట్ల కింద పేకాట ఆడుతున్న స్థావరాలపై టాస్క్ ఫోర్స్, ఎస్బీ సిబ్బంది ఆదివారం మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో 8 మంది జూదరులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.2,410 నగదుతో పాటు 7 మొబైల్ ఫోన్లు, 4 ద్విచక్ర వాహనాలను జప్తు చేశారు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం నిందితులను ఫిరంగిపురం పోలీసులకు అందజేశారు.

Comments

G
Loading comments...