వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కార వేదిక బాధితుల న్యాయపరమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ పోలీసు అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన PGRS లో ప్రజల నుంచి 35 ఫిర్యాదులను స్వీకరించారు. వాటిలో 20 భూతగాదాలు, 4 కుటుంబ కలహాలు, ౩ మోసాలు, 8 ఇతర సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులు విచారణ జరిపి చట్టపరిధిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Loading comments...

