వార్తలకు తిరిగి వెళ్లండి
ప్యూర్టో రికో నుండి చికాగో వెళ్తున్న ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచి దూకేందుకు ప్రయత్నించాడు. తోటి ప్రయాణికులు వెంటనే స్పందించి అతడిని అదుపులోకి తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ ఘటనతో పైలట్లు విమానాన్ని మయామి ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. సదరు వ్యక్తి ప్రవర్తనపై విచారణ జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Comments
Loading comments...

