Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేగుంట శివారులో వ్యక్తి మృతదేహం లభ్యం

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 13, 2026 2:29 PM మెదక్General
చేగుంట శివారులో వ్యక్తి మృతదేహం లభ్యం - Udayam
చేగుంట గ్రామ శివారులోని ఎన్‌హెచ్‌-44 సమీపంలో లభించిన మృతదేహాన్ని జప్తి శివునూరుకు చెందిన మ్యాకల సురేష్‌ (38)గా పోలీసులు గుర్తించారు. మద్యానికి బానిసైన సురేష్‌ను 20 రోజుల క్రితం కుటుంబసభ్యులు మందలించడంతో ఇల్లు వదిలి వెళ్లాడు. అతిగా మద్యం తాగడం వల్లే ఆరోగ్యం క్షీణించి ఆయన మృతి చెంది ఉండవచ్చని సోదరి శోభ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Comments

G
Loading comments...