వార్తలకు తిరిగి వెళ్లండి
రాయలచెరువులో వ్యక్తి ఆత్మహత్య

తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం రాయలచెరువులో విషాద ఘటన చోటుచేసుకుంది. సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పొలంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటి వద్ద జరిగిన తగాదా నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
పోలీసు స్టేషన్‌కు వెళ్లి వచ్చిన అనంతరం సుబ్రహ్మణ్యం ఆత్మహత్య చేసుకోవడంతో కలకలం రేగింది. పోలీసుల వేధింపుల వల్లే ఈ ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...