Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అగ్నివీరుల శాశ్వత ఉద్యోగాల పెంపునకు సైన్యం మొగ్గు

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 06, 2026 11:40 AM జాతీయంGeneral
అగ్నివీరుల శాశ్వత ఉద్యోగాల పెంపునకు సైన్యం మొగ్గు - Udayam
అగ్నిపథ్ పథకం కింద నాలుగేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత శాశ్వత ప్రాతిపదికన కొనసాగించే అగ్నివీరుల శాతాన్ని పెంచాలని భారత సైన్యం భావిస్తోంది. నౌకాదళం 75 శాతం, ఆర్మీ, వాయుసేనలు 50 శాతానికి పెంచే అవకాశముంది. శిక్షణ పొందిన అనుభవజ్ఞులైన సిబ్బందిని సైన్యంలో ఉంచుకోవడం ద్వారా ఆధునిక ఆయుధ వ్యవస్థల నిర్వహణ సులువవుతుందని, అలాగే బలగాల కొరతను కూడా భర్తీ చేయవచ్చని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

Comments

G
Loading comments...