వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన దురదృష్టకరమని, బాధిత కుటుంబాలకు ఎన్డీయే ప్రభుత్వం శాశ్వతంగా అండగా ఉంటుందని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన ఆరు గంటల్లోనే కేంద్రమంత్రి కుమారస్వామి స్వయంగా వచ్చి పరిశీలించారని, మృతుల కుటుంబాలకు అదనంగా రూ.25 లక్షల పరిహారం ప్రకటించారని తెలిపారు.
మరణించిన వారు శాశ్వత లేదా ఒప్పంద ఉద్యోగులైనా తమకు సమానమేనని, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగం కల్పిస్తామన్నారు. నిపుణుల కమిటీ ద్వారా ప్రమాద లోపాలను పరిశీలిస్తామని, విశాఖ ఉక్కును కాపాడుకుంటూ ఉత్పత్తిని తిరిగి ప్రారంభించామని లోకేశ్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

