వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుకొండలోని 11వ వార్డు శ్రీరాములయ్య కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది. కాలనీ మొదట్లోని చెరువు మరువ కాలువ మూసుకుపోవడంతో మురుగునీరు ముందుకు వెళ్లకుండా నిలిచిపోతోందని స్థానికులు తెలిపారు.
దీంతో కాలనీలో అపరిశుభ్రత నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరారు. రాబోయే ఎన్నికల్లోనైనా తమ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

