వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ ప్రభావంతో వీచిన బలమైన గాలులకు ఒంగోలు కేశవస్వామిపేటలోని శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయ ధ్వజస్తంభం కూలిపోయింది. మూడేళ్ల క్రితం రూ.20 లక్షలతో నిర్మించిన 62 అడుగుల ధ్వజస్తంభం సోమ, మంగళవారాల్లో వీచిన గాలులకు నేలకొరిగింది.
ధ్వజస్తంభం ఆలయంపై కాకుండా మరోవైపు పడటంతో ప్రమాదం తప్పింది. దాని పునర్నిర్మాణానికి ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

