Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షన్ల దరఖాస్తు గడువు పెంచాలని డిమాండ్

Follow Udayam on Google
B Ganga Sep 10, 2026 7:02 PM పార్వతీపురం మన్యంGeneral
పెన్షన్ల దరఖాస్తు గడువు పెంచాలని డిమాండ్ - Udayam
నూతన పెన్షన్ల దరఖాస్తుకు ప్రభుత్వం విధించిన గడువును ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు పొడిగించాలని లిబరేషన్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు పి. సంఘం కోరారు. పేదలు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలకు అవసరమైన పత్రాలు సమర్పించేందుకు మరింత సమయం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు గంగాపురం గ్రామ సచివాలయంలో అడ్మిన్ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో వెలమల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...