Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షన్ దరఖాస్తులను క్రాస్ చెక్ చేస్తున్నాం

Follow Udayam on Google
P. G. Murthy Oct 06, 2026 1:26 PM మంచిర్యాలGeneral
పెన్షన్ దరఖాస్తులను క్రాస్ చెక్ చేస్తున్నాం - Udayam
దండేపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో స్వీకరించిన చేయూత పెన్షన్ దరఖాస్తుల క్రాస్ చెకింగ్ జరుగుతోందని మండల ప్రత్యేక అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం మధ్యాహ్నం మండలంలోని పలు గ్రామాల్లో స్థానిక ఎంపీడీవో ప్రసాద్ తో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయిలో పెన్షన్ దరఖాస్తులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు ఉన్నారు.

Comments

G
Loading comments...