Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెంబి మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

Follow Udayam on Google
సందీప్ Jul 08, 2026 10:38 AM నిర్మల్ General
పెంబి మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా - Udayam
మారుమూల ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 24 గంటల పాటు నాణ్యమైన వైద్యసేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం పెంబి మండలంలో ఆకస్మికంగా పర్యటించిన ఆయన ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ పాఠశాల, కేజీబీవీ, గ్రామపంచాయతీ కార్యాలయాలను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. ముందుగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, ఓపీ విభాగం, మందుల నిల్వ గది, ఇతర విభాగాలను పరిశీలించారు. అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని, రోజువారీ ఓపీ నమోదు, వైద్యులు, సిబ్బంది హాజరు వివరాలను పరిశీలించి అన్ని రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.

Comments

G
Loading comments...