Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేరులో 'భోగాపురం' లేకపోవడం పై పతివాడ వ్యాఖ్యలు

Follow Udayam on Google
B RAJESH Aug 19, 2026 9:35 AM విజయనగరంGeneral
పేరులో 'భోగాపురం' లేకపోవడం పై పతివాడ వ్యాఖ్యలు - Udayam
అల్లూరి సీతారాంరాజు విమానాశ్రయం పేరులో 'భోగాపురం' పేరు లేకపోవడం వల్ల జిల్లా ప్రజల ఆత్మాభిమానం దెబ్బ తింటోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి నాయుడు పేర్కొన్నారు. విజయనగరంలోని తన నివాసంలో లోక్ సత్తా ఆధ్వర్యంలో ఈ విషయమై చేపట్టిన పోస్ట్ కార్డు ఉద్యమానికి మద్దతు తెలుపుతూ సంతకం చేసి పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో లోక్సత్తా అధ్యక్షుడు భీశెట్టి బాజ్జీ, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...