Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే

Follow Udayam on Google
K Anuradha Aug 26, 2026 4:08 PM శ్రీకాకుళంGeneral
పేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే - Udayam
లావేరు (M) చిన్న మురపాక గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు గేదెల లక్ష్మణరావు గత ఏడాది ఆముదాలవలసలో పనులు చేస్తుండగా 11 కేవీ విద్యుత్ లైన్‌కు ఇనుప రాడ్డు తగిలి మృతి చెందారు. దీంతో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. విషయం తెలుసుకున్న MLA ఈశ్వరరావు విద్యుత్ అధికారులతో మాట్లాడి ప్రభుత్వ ఆర్థిక సాయం అందేలా కృషి చేశారు. మృతుడి భార్య ఆసిరితల్లి ఖాతాలో బుధవారం ప్రభుత్వం రూ.5 లక్షలు జమ చేసింది.

Comments

G
Loading comments...