Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెదపాడులో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 6:11 PM ఏలూరుGeneral
పెదపాడులో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ - Udayam
పెదపాడు మండలం కలపర్రులో ‘మీ భూమి - మీ హక్కు’ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రైతులకు రాజముద్ర కలిగిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన లబ్ధిదారులకు రేషన్ బియ్యం అందజేశారు. లబ్ధిదారులకు 35 కేజీల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో దెందులూరు ఏఎంసీ ఛైర్మన్ గారపాటి రామసీత, తహశీల్దార్ కృష్ణ జ్యోతి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...