Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లిలో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు

Follow Udayam on Google
S. Kumar Sep 25, 2026 5:05 PM పెద్దపల్లితెలంగాణ
పెద్దపల్లి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి క్యాంపు కార్యాలయంలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం ఆధ్వర్యంలో నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజంలో చివరి వ్యక్తికి అభివృద్ధి ఫలాలు అందాలన్న దీన్‌దయాళ్ ఆలోచనలు ఎప్పటికీ ఆదర్శనీయమని సదానందం పేర్కొన్నారు.

Comments

G
Loading comments...