వార్తలకు తిరిగి వెళ్లండి
పెద్దపల్లి: కలెక్టరేట్ ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం భారీ నిరసన చేపట్టడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా సీఈసీ గణేష్ కుమార్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని సీపీఐ నాయకుడు సదానందం డిమాండ్ చేశారు.
అధికారుల బాధ్యతారాహిత్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సస్పెండ్ చేయకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

