వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్-నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై పెద్దవూర మండలం ఉరబవీతండ సమీపంలోని లెఫ్ట్ కెనాల్ బ్రిడ్జిని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను నాగార్జునసాగర్ కమలానెహ్రూ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

