వార్తలకు తిరిగి వెళ్లండి

మధిర మున్సిపాలిటీ పరిధిలో పందులు విచ్చలవిడిగా సంచరిస్తుండటంతో సమస్యను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
మున్సిపల్ ఛైర్ పర్సన్ సామినేని సుజాత, కమిషనర్ సామ్యూల్ బెనిటిక్ ఇజ్రాయిల్ పాల్ పందుల పెంపకందారులతో సమావేశమై పది రోజుల్లో సంచారాన్ని కట్టడి చేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. యజమానులు పందులను నియంత్రిస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

