Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పచ్చదనాన్ని పెంచేందుకు మొక్కలు నాటాలి

Follow Udayam on Google
p.g.murthy Aug 25, 2026 12:53 PM మంచిర్యాలGeneral
పచ్చదనాన్ని పెంచేందుకు మొక్కలు నాటాలి - Udayam
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కాపాడాలని జన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ కోరారు. వనమహోత్సవం పురస్కరించుకొని మంగళవారం మండలంలోని ధర్మారం గ్రామ యుపిఎస్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. పచ్చదనం అతి ముఖ్యమైందని, దానికి కాపాడుకోవాలంటే మొక్కలు నాటి సంరక్షించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...