Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పవన్‌కల్యాణ్‌ చిత్రాల ధ్వంసం కేసు

Follow Udayam on Google
రాజిత దేవి Jul 23, 2026 3:48 PM పోలవరం General
పవన్‌కల్యాణ్‌ చిత్రాల ధ్వంసం కేసు - Udayam
రాజోలు నియోజకవర్గంలోని సఖినేటిపల్లి, మోరిపోడు గ్రామాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిత్రాలను ధ్వంసం చేసిన కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 4.69 కిలోల గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. మద్యం, గంజాయి మత్తులోనే నిందితులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి వారికి రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Comments

G
Loading comments...