వార్తలకు తిరిగి వెళ్లండి
దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్
నవీన్ రెడ్డి Jun 25, 2026 4:53 AM అమరావతి 10 views1 day ago

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బుధవారం మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక దీక్షను స్వీకరించారు. ఏటా గురుముఖత పొందిన మంత్రోపదేశాన్ని ఆచరించేందుకు నాలుగు నెలల పాటు ఆయన ఈ దీక్ష చేపడతారు. ఆలయ ఈవో, అర్చకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజల్లో పవన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్‌ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
Comments
Loading comments...