వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి జిల్లా బల్లగరువు పర్యటనలో ఇచ్చిన హామీ మేరకు గిరిజనుల కోసం రూ.కోటితో చేపట్టిన అభివృద్ధి పనులను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పూర్తి చేయించారు. అంగన్‌వాడీ కేంద్రాలు, తాగునీరు, సీసీ రోడ్ల వసతులు అందుబాటులోకి వచ్చాయి.
ఉపాధి హామీ కింద రూ.55 లక్షలతో భవనాలు, బోర్లు, పైప్‌లైన్లు ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ సీఎం కార్యాలయం తెలిపింది. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని ఈ సందర్భంగా పవన్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

