వార్తలకు తిరిగి వెళ్లండి

సిర్పూర్(టి) మండలం పారిగాం గ్రామంలోని చెరువు రెండు, మూడు రోజులుగా కురిసిన వర్షాలతో నిండుకుండలా మారింది. చెరువులోకి సమృద్ధిగా నీరు చేరడంతో పరిసర ప్రాంతాల్లోని వందల ఎకరాల పొలాలకు సాగునీటి భరోసా ఏర్పడిందని రైతులు తెలిపారు.
చెరువులో పుష్కలంగా నీరు ఉండటంతో ఈ ఏడాది సాగుకు ఇబ్బందులు ఉండవని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

