వార్తలకు తిరిగి వెళ్లండి
పంచాయతీ సమాచార నమోదు గడువు

రాష్ట్రంలోని 12,760 గ్రామ పంచాయతీల సమగ్ర సమాచార నమోదు ప్రక్రియను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఆర్థిక సంఘం మార్గదర్శకాలు, ఇతర అంశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
పంచాయతీల పరిధిలోని జనాభా, ఆస్తులు, వనరుల వివరాలను కార్యదర్శుల ద్వారా సేకరించనున్నారు. వచ్చే మూడేళ్ల అభివృద్ధి ప్రణాళికలు, వార్షిక బడ్జెట్ రూపకల్పనకు ఈ సమాచారాన్ని ఉపయోగించనున్నారు.
Comments
Loading comments...