వార్తలకు తిరిగి వెళ్లండి

పెంటపాడు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి పంచాయతీ కార్మికుల సమస్యలను యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు ఆంజనేయులు గురువారం తెలుసుకున్నారు. తక్కువ వేతనాలు, గుర్తింపు కార్డులు, యూనిఫాం, పాదరక్షలు వంటి సమస్యలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు.
అధికారులకు వినతిపత్రం అందజేసి, తదుపరి జిల్లా వ్యాప్తంగా దశలవారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

