Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

Follow Udayam on Google
భవ్య శ్రీ Jun 27, 2026 4:41 PM ఖమ్మంGeneral
 ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి - Udayam
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం భానుపురం పంచాయతీ కార్యదర్శి తమ్మిశెట్టి సురేష్ రూ. 25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఇంటి నిర్మాణ అనుమతి, నంబర్ కేటాయించేందుకు ఆయన ఈ మొత్తాన్ని డిమాండ్ చేశారు. ముదిగొండ రైతు వేదిక సమీపంలో లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...