Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు వాటర్‌గ్రిడ్ పనులు నత్తనడకన

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 08, 2026 6:35 PM పల్నాడు General
పల్నాడు వాటర్‌గ్రిడ్ పనులు నత్తనడకన - Udayam
పల్నాడు తాగునీటి వాటర్‌గ్రిడ్‌లోని ఇన్‌టేక్‌ వెల్‌ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. నాగార్జునసాగర్‌కు వరద వస్తే వెల్‌లోకి నీరు చేరి పనులు నిలిచిపోయే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. రూ.1,200 కోట్ల ప్రాజెక్టులో వెల్‌ పనులు ఇంకా పూర్తికాలేదు. పనులు వేగవంతం చేస్తామని డీఈఈ ఎస్‌.కాశీరెడ్డి తెలిపారు. పనులు పూర్తయితే డిసెంబరులో మాచర్ల, గురజాల, బెల్లంకొండకు నీరందిస్తామన్నారు.

Comments

G
Loading comments...