వార్తలకు తిరిగి వెళ్లండి

భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ఉగ్రవాదులపై కేంద్ర హోంశాఖ మరోసారి ఉక్కుపాదం మోపింది. జైషే మహ్మద్, లష్కరే తోయిబా వంటి నిషేధిత సంస్థలతో సంబంధాలున్న 23 మందిని శనివారం 'ఉగ్రవాదులు'గా ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
యూఏపీఏ చట్టం-1967 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే లేదా ప్రోత్సహించే ఏ వ్యక్తినైనా ఈ చట్టం కింద ఉగ్రవాదిగా గుర్తించే సర్వాధికారాలు కేంద్రానికి ఉన్నాయి.
Comments
Loading comments...

