వార్తలకు తిరిగి వెళ్లండి

టెలిగ్రామ్ యాప్‌లో పెద్ద ఎత్తున జరుగుతున్న సినిమాల పైరసీపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ శనివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పైరసీ లింకులు, ఓటీటీ కంటెంట్‌ను తక్షణమే నిలిపివేయాలంటూ సదరు సంస్థకు కేంద్ర ప్రభుత్వం గట్టి నోటీసులు జారీ చేసింది.
భారతీయ చిత్ర పరిశ్రమ, క్రియేటర్ల ఆర్థిక ప్రయోజనాలను కాపాడేందుకు ఈ చర్యలు చేపట్టింది. తీసుకున్న చర్యలపై 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక (ATR) సమర్పించాలని టెలిగ్రామ్ యాజమాన్యాన్ని కేంద్రం ఆదేశించింది.
Comments
Loading comments...

