వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వే మూసివేత నిర్ణయాన్ని (NOTAM) అధికారులు ఉపసంహరించుకోవడంపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా హర్షం వ్యక్తం చేశారు. సోమ, మంగళవారాల్లో విమానాల నిలిపివేత వార్తలతో పర్యాటక రంగం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
ఈ సమస్యపై తాను నిరంతరం శ్రమించానని, తాత్కాలికంగా ఈ ముప్పు తప్పడం పెద్ద ఉపశమనమని ఒమర్ చెప్పారు. అయితే అక్టోబర్‌లో ఎయిర్‌పోర్టును పూర్తిగా మూసివేసినప్పుడు, అవాంతిపురాలో ప్రత్యామ్నాయ విమాన సర్వీసులు నడిపేలా తదుపరి ప్రయత్నాలు చేస్తామన్నారు.
Comments
Loading comments...

