Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీవోకేలో నిరసనకారులపై పాక్‌ కఠిన చర్యలు

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 29, 2026 12:02 PM జాతీయంGeneral
పీవోకేలో నిరసనకారులపై పాక్‌ కఠిన చర్యలు - Udayam
పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లో ప్రజా నిరసనలపై పాకిస్థాన్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. పూంచ్‌ డివిజన్‌లో 13 పాఠశాలల గుర్తింపును రద్దు చేయడంతో పాటు పలువురు నిరసన నాయకుల ఆస్తులను స్వాధీనం చేసుకుంది. నిరసనకారుల పాస్‌పోర్టులను సస్పెండ్ చేయగా, కొందరు జర్నలిస్టుల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు సమాచారం. దాదాపు 500 మంది నిరసనకారులను ఉగ్రవాదుల జాబితాలో చేర్చినట్లు వెల్లడైంది.

Comments

G
Loading comments...