Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌ డ్రోన్ల చొరబాటు యత్నం.. తరిమికొట్టిన భారత సైన్యం

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 9:29 AM జాతీయంGeneral
పాక్‌ డ్రోన్ల చొరబాటు యత్నం.. తరిమికొట్టిన భారత సైన్యం - Udayam
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా ఎల్‌వోసీ వద్ద భారత వాయుసీమలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన మూడు పాకిస్థాన్‌ డ్రోన్లను భారత సైన్యం వెనక్కి తరిమికొట్టింది. నౌషేరా సెక్టార్‌లోని రుమ్లీధార వద్ద వాటిని గుర్తించిన బలగాలు కౌంటర్‌-డ్రోన్‌ వ్యవస్థలను క్రియాశీలం చేశాయి. దీంతో మూడు డ్రోన్లు పాకిస్థాన్‌ వైపు వెళ్లిపోయాయి. అనంతరం ముందుజాగ్రత్తగా ఆ ప్రాంతంలో సైన్యం గాలింపు చేపట్టింది.

Comments

G
Loading comments...