Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నొప్పితోనూ రజతం సొంతం

Follow Udayam Digital on Google
ధీరజ్ రెడ్డి Jul 29, 2026 9:42 PM అల్ ఇండియా క్రీడలు
నొప్పితోనూ రజతం సొంతం - Udayam Digital
కామన్వెల్త్‌ పోటీల్లో తొలిసారి బరిలోకి దిగిన జ్ఞానేశ్వరి యాదవ్‌ మహిళల 53 కిలోల వెయిట్‌లిఫ్టింగ్‌లో మొత్తం 199 కిలోలు ఎత్తి రజత పతకం సాధించింది. నెలసరి నొప్పిని భరిస్తూనే ఈ ఘనత అందుకుంది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన జ్ఞానేశ్వరి చిన్నప్పటి నుంచే తండ్రి ప్రోత్సాహంతో వెయిట్‌లిఫ్టింగ్‌లో రాణించింది. ఖేలో ఇండియా, జూనియర్‌ జాతీయ పోటీల్లోనూ టైటిళ్లు గెలిచి అంతర్జాతీయ వేదికపై మరో విజయాన్ని అందుకుంది.

Comments

G
Loading comments...