Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాయకరావుపేటలో నేతన్న సేవా పథకంపై ఫిర్యాదు

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 10:45 AM అనకాపల్లి General
పాయకరావుపేటలో నేతన్న సేవా పథకంపై ఫిర్యాదు - Udayam
పాయకరావుపేట పట్టణంలోని అర్హులైన లబ్ధిదారులకు నేతన్న సేవా పథకం చేరలేదని చేనేత కార్మికులు బుధవారం విశాఖలో రాజ్యసభ సభ్యుడు గొల్లబాబురావును కలిసి తెలిపారు. చేనేత కార్మికుడు కొమ్మని వేంకటేశ్వరరావు మాట్లాడుతూ.. పథకంలో అవకతవకలు జరిగినట్లు తెలిపారు. దీనిపై విచారణకు ఆదేశించాలని గొల్లబాబురావును కోరినట్లు చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ జగతా శ్రీను, చేనేత కార్మికులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...