Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలలో ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు

Follow Udayam on Google
Mohammad Sep 05, 2026 5:02 PM అనంతపురంGeneral
పాఠశాలలో ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు - Udayam
గుత్తి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం సుంకన్న అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. గుత్తి కోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయభాస్కర్ హాజరయ్యారు. ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు.

Comments

G
Loading comments...